చిన్ననాటి స్నేహం;- -గద్వాల సోమన్న,9966414580
చిన్ననాటి స్నేహమే
చెదిరిపోని  జ్ఞాపకము
అలనాటి జీవితమే
అత్యంత మనోహరము

కల్లాకపటమెరుగనిది
వెన్నుపోటు తెలియనిది
చిన్ననాటి బంధాలు
గుబాళించు గంధాలు

బేధభావం లేనిది
అపవిత్రమే కానిది
చిన్ననాటి అనుబంధము
చిరకాలం నిలుచునది

తేనె వోలె తీయనిది
వీణ రీతి మ్రోగునది
పున్నమి నాటి వెన్నెల
బాల్యమంటే కళకళ

దేవుడే వరమిస్తే
బాల్యాన్ని కోరుకుంటా!
చిన్ననాటి సంగతులు
నెమరు వేసుకుంటా!

బాల్యానికి మించినది
ఎక్కడైనా ఉండునా!
బాల్యంలోని స్మృతులను
మరచిపోవుట జరుగునా!


కామెంట్‌లు