జీవితమంటే!!....;- -గద్వాల సోమన్న,9966414580
జీవితము సాగరము
ఆటుపోట్లు సహజము
అన్నిటికీ తట్టుకొని
చేరాలి విజయ తీరము

జీవితం కాదు కాదు
వడ్డించిన విస్తరి
పరికింప లేదు లేదు
సులభతరం చదువరి

జీవితానికర్థము
ఉండాలి పరమార్థము
మంచి మంచి పనులతో
కావాలి సార్థకము

బ్రతుకుల్లో ముసిరిన
విస్తార ఇక్కట్లు
ఉండవు కలకాలము
అమావాస్య చీకట్లు

సుఖదుఃఖాల మిళితము
గెలుపుఓటములమయము
మానవుని జీవితము
సృష్టిలోన ఉన్నతము

జీవితమే యుద్ధము
చేయాలి నిరంతరము
అప్రమత్తంగా ఉండి
కావాలోయ్! సిద్ధము

విలువైనది జీవితము
కాకూడదోయ్! విఫలము
అవరోధాలున్ననూ
అధిగమిస్తే విజయము

పూలపాన్పు అనుకోకు
అతిగా ఇక ఆశించకు
ఉన్న దానిలో సంతృప్తి
ఉన్నచో పరి సమాప్తి

జీవితము పోరాటము
ఉందిలే! ఆరాటము
చూపాలోయ్! సాహసము
జరుగునోయ్! అద్భుతము

జీవితాన అవసరము
అత్యంత జాగ్రత్తలు
లేకుంటే ఛిద్రము
చేసుకోవాలి భద్రము


కామెంట్‌లు