చిలుక సందేశం;--గద్వాల సోమన్న,9966414580
అపనిందలు బహు హేయము
ఎవరి మీద వేయరాదు
జీవకోటి సమానము
చులకనగా చూడరాదు

మానవత్వమే హేమము
మౌనంగా ఉండరాదు
పొరపాటున అన్యాయము
ఎవరికీ చేయరాదు

చురుకుదనమే అవసరము
బద్ధకం పనికిరాదు
దరహాసం మనోహరము
దూరం చేసుకోరాదు

పుస్తకం హస్తభూషణము
ఎన్నడూ వీడరాదు
కన్నవారు అపురూపము
కన్నీరు పెట్టించరాదు


కామెంట్‌లు