వాస్తవాల వజ్రాలు;- -గద్వాల సోమన్న,9966414580
రైతు లేక అన్నము
నోటిలోకి వచ్చునా!
కవులు లేక కావ్యము
రూపుదిద్దుకొనునా!

అమ్మ లేక ఇంటిలో
వెలుగుపూలు పూయునా!
నాన్న లేక బ్రతుకులో
భవిత దివ్వె వెలుగునా!

గురువు లేక జగతిలో
అజ్ఞానం తొలగునా!
తరువు లేక  పుడమిలో
స్వచ్ఛ వాయువులందునా!

పిల్లలు లేక ఇహమున
ప్రగతి సాధ్యపడునా!
కన్నవారి మనసున
ఆనందముండునా!


కామెంట్‌లు