గురువు గారి బోధనలు;- -గద్వాల సోమన్న,9966414580
ఆధ్యాత్మిక జగత్తు
అత్యంత మహత్తు
భగవంతుని వేడిన
తప్పిపోవు విపత్తు

పసి పిల్లల చేష్టలు
గమనింప గమ్మత్తు
ఆనందం పంచును
మదిలో వారి పొత్తు

కన్నోళ్లకు పిల్లలు
అమూల్యమైన సొత్తు
వికసించిన మల్లెలు
దేవుళ్ళు సాక్షాత్తు

విద్యతో  పెంచాలి
పిల్లల్లో విద్వత్తు
అనుదినము సాగాలి
తప్పక కసరత్తు


కామెంట్‌లు