బాతమ్మ ప్రబోధం;- -గద్వాల సోమన్న,9966414580
చులకన చేయరాదు
నమ్మిన సిద్ధాంతము
అతిచిన్ని విషయాలకు
కూడదు రాద్దాంతము

ఎపుడు మరువరాదు
చేసిన ఉపకారము
మంచిని వదలరాదు
కల్గియుండు అనిశము

పతనము కోరరాదు
ఆశించుము క్షేమము
అపనింద వేయరాదు
గ్రహించుము వాస్తవము

ఎక్కడ విప్పరాదు
పరుల గుట్టు మాత్రము
చాడీలు చెప్పరాదు
పరికింప అసహ్యము

తప్పులు వెదకరాదు
దిద్దుట గొప్పతనము
నిత్యము గొణుగరాదు
నీచమైన లక్షణము


కామెంట్‌లు