అక్షర సత్యాలు-ఆణిముత్యాలు;- -గద్వాల సోమన్న,9966414580
నిలకడ లేని మనసులు
నీతి తప్పిన  మనుషులు
వాస్తవంగా వ్యర్థము
తెచ్చిపెట్టు అనర్ధము

గుండె నిండా కలతలు
నెమ్మది లేని బ్రతుకులు
కోకొల్లలు జగతిలో
గగన కుసుమం ప్రగతిలో

సభ్యత లేని వ్యక్తులు
సఖ్యత లేని గృహములు
అమావాస్య చీకట్లు
పొరుగువారికి ఇక్కట్లు

మనసున రాగద్వేషాలు
బ్రతుకున విషతుల్యాలు
విడిచిపెడితే మంచిది
బహుమానమే గొప్పది


కామెంట్‌లు