ఖగము కర్తవ్య బోధన;- -గద్వాల సోమన్న,9966414580
నవ్వులే ముఖంలో
పువ్వులై వికసించు
వికారమే తరిమేసి
దివ్వెలై ప్రకాశించు

పిల్లలే గృహంలో
మల్లెలై గుబాళించు
అల్లరితో భువిలో
ఎల్లరిని అలరించు

కన్నవారి మదిలో
చిన్నారులే మిన్న
వెన్న అంత మధురము
వెన్నెల్లా అందము

ముద్దులొలుకు బాలలు
ముద్దబంతి పూవులు
శుద్ధమైన బుద్ధితో
ఉద్ధరించు  జగతిని


కామెంట్‌లు