వనిత ఇంటికి ఘనత;- -గద్వాల సోమన్న,9966414580
ఇంటి దీపం మగువ
గుబాళించే కలువ
సృష్టికి ఆధారం
ఉండాలోయి! ఎగువ

ఇంటికందం వనిత
తెచ్చిపెట్టును ఘనత
ఇంటిల్లిపాదికిల
పంచిపెట్టును మమత

సదనంలోన మహిళ
ఉంటేనే కళకళ
లేకుంటే అచ్చోట
పోవునోయి వెలవెల

స్త్రీ మూర్తులను మనము
గౌరవించుట ఘనము
చేయునామె జగతిని
చక్కని పూలవనము


కామెంట్‌లు