అమ్మ ప్రబోధం;- -గద్వాల సోమన్న,9966414580
సజ్జనుల సహవాసం
సమకూర్చు సంతోషం
దుష్టుల సాంగత్యం
సాగనంపు వనవాసం

అమూల్యం దరహాసం
మోములో మధుమాసం
అందాల ఇంద్రచాపం
వెలుగులీను మణిదీపం

బాల్యమే బంగారం
బ్రతుకులో సింగారం
భగవంతుని బహుమానం
స్వర్గంతో సమానం

కలసుంటే ఇల నాకం
లేకుంటే యమలోకం
గుండెల్లో పెను భారం
దిచ్చుకుంటే సుదూరం


కామెంట్‌లు