చింతలు చితిమంటలు;- -గద్వాల సోమన్న,9966414580
చింతలన్ని వీడుము
మనశ్శాంతి పొందుము
హానికరం చింతలు
గుండెల్లో మంటలు

ఆరోగ్యం చెరుపును
ఆనందం పోవును
మితిమీరిన చింతలు
క్రుంగునట్లు చేయును

చింతకు బహు దూరము
ఉంటేనే స్వర్గము
ఆదిలో త్రుంచితే
ఉండదోయ్! భారము

వద్దు వద్దు చింతలు
చిదిమేయును మనసులు
వ్యర్థం చేసుకోకు
చింతలతో బ్రతుకులు


కామెంట్‌లు