సత్యాలు;--గద్వాల సోమన్న,9966414580
నవ్వితే గలగల
ముఖమంతా కళకళ
లేకుంటే పోవును
మోమంతా వెలవెల

కురిస్తే  వెన్నెల
వెండిలా తళతళ
మధురాతి మధురం
కూస్తేనే  కోకిల

ఊగితే ఊయల
మనసుకు హాయి ఇల
పాఠాలు నేర్పును
ఎగిసి పడే అల

తార మెరియు మిలమిల
ఉరుము ఉరుము పెళ పెళ
కన్నీరు పారును
యేరులా జలజల


కామెంట్‌లు