నాయనమ్మ హితోక్తులు;- -గద్వాల సోమన్న,9966414580
మంచితనమే మనిషికి
అసలైన పురస్కారము
ప్రశ్నలకు కొన్నిసార్లు 
మౌనమే సమాధానము

ఎటువంటి సమస్యకైనా
ఉండునోయ్! పరిష్కారము
మానవ జీవితాల్లో
గొప్పదోయ్! సంస్కారము

సభ్య సమాజంలోన
వినయమే అలంకారము
హెచ్చితే మనసులోన
చెరుపునోయ్! అహంకారము

కోరితే సహకారము
చేయాలోయ్! వేగిరము
వీడితే అపకారము
ఉండునోయ్! బహుమానము

దైవగుణం కారుణ్యము
పెరగాలోయ్! కొండలా
మేలుకాదు కాఠిన్యము
తరగాలోయ్! హిమంలా


కామెంట్‌లు