పంతులమ్మ ప్రబోధం;- -గద్వాల సోమన్న,9966414580
ఆధ్యాత్మిక చింతన
మోక్షానికి వంతెన
మంచి పనులు చేస్తే
బ్రతుకంతా దీవెన

భగవంతుని సన్నిధి
మనిషికదే పెన్నిధి
దైవ నామ ధ్యానము
పెంచుతుంది జ్ఞానము

పెద్దలను చులకన
చేస్తే ఇక వేదన
ఎవరిని చేయరాదు
ఏమాత్రం హేళన

హద్దు లేని కోపము
చెరుపును ఆరోగ్యము
మది నిండా శాంతము
జీవితాన భాగ్యము


కామెంట్‌లు