ఎంతో మంచిది;- -గద్వాల సోమన్న,9966414580
శత్రువులకు బలము
మిత్రులకు సుగుణము
పంచితే మంచిది
నలుగురికి స్నేహము

కష్టాల్లో సహనము
కన్నీల్లో మౌనము
వహిస్తే మంచిది
భవితయగును భద్రము

అడిగితే న్యాయము
అవసరాన సాయము
అందిస్తే మంచిది
పేదలకు అన్నము

ప్రతిరోజు ధ్యానము
పదిమందికి దానము
చేసేస్తే మంచిది
దొరుకుతుంది పుణ్యము

హానికరం గర్వము
హరించును సర్వము
వీడితే మంచిది
పనికిరాని గుణము

మనసులో నిర్మలము
మాటలో  మృదుత్వము
ఉంటే మంచిది
గొప్పది క్షమాగుణము


కామెంట్‌లు