శాలిపేట గ్రామంలో రామయ్య, వీరయ్య అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. వారిద్దరూ పాతిక సంవత్సరాలుగా ప్రాణ స్నేహితులుగా ఉన్నారు. ఇద్దరు గ్రామాలలో తిరిగి బట్టల వ్యాపారం చేసేవారు. శాలిపేటకు కొద్ది దూరంలో ఉన్న సిరిపురం టౌనుకు వెళ్లి బట్టలు కొనుక్కొని పొరుగు ఊర్లకు కలిసి వెళ్లి బట్టలు అమ్మేవారు. బట్టలు అమ్మగా వచ్చిన లాభం చెరిసగం పంచుకునేవారు.
పాతికేళ్లుగా వారిద్దరి స్నేహాన్ని చూసి టౌన్ లోని బట్టల దుకాణం యజమాని సుందరం ఆశ్చర్యపోయేవాడు. రామయ్య, వీరయ్యల స్నేహం ఎంతగా ఉందో తెలుసుకోవాలని సుందరం పరీక్షించాలనుకున్నాడు. రోజు ఒకే గ్రామం వెళ్లే రామయ్య, వీరయ్యలకు బట్టలు ఇచ్చి, వేరే వేరే గ్రామాలకు సుందరం పంపాడు. రామయ్యకు దారిలో వెళ్తుండగా కొంత బంగారం దొరికింది. వీరయ్యకు దారిలో వెళ్తుండగా కొంత డబ్బు దొరికింది. వాటిని తీసుకుని గ్రామాలకు వెళ్లి, వ్యాపారం చేశాక తిరిగి ఇద్దరు తమ ఊరికి వెళ్లే దారిలో కలిసారు.
ఒక దగ్గర ఆగి నీళ్లు తాగాలని బావి దగ్గరికి ఒక్కొక్కరు వెళ్లారు. రామయ్య తనకు దొరికిన బంగారంలో సగం వీరయ్య సంచిలో వీరయ్య కు తెలవకుండా వేశాడు. వీరయ్య కు దొరికిన డబ్బులలో సగం రామయ్య సంచిలో రామయ్య తెలవకుండా వేశాడు. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు బంగారం, డబ్బు వేసుకుని ఇంటికి వెళ్లారు. రాత్రి తమ సంచిలో బంగారం మరియు డబ్బులు చూసుకుని ఇద్దరు ఆశ్చర్యపోయారు. మిత్రులు ఇద్దరికీ ఒకరికి బంగారం ఒకరికి డబ్బు దొరికిందని గ్రహించారు. మరుసటి రోజు ఈ విషయం దుకాణం యజమాని సుందరంకు చెప్పాడు. మీకు బంగారం, డబ్బు దారిలో దొరికేలా చేసింది నేనేనని, మీరు వాటిని పంచుకున్న తీరు అమోఘం. మీ ఇద్దరి స్నేహానికి నమస్కరిస్తూ వాటిని మీరే దాచుకోమని సుందరం చెప్పాడు. రామయ్య, వీరయ్యలు జీవితాంతం స్నేహం చేస్తూ, దాచిన సొమ్ములో అవసరమైన సందర్భంలో సహాయం చేస్తూ ఆదర్శంగా నిలువసాగారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి