మర్రికొండ అడవిలో జంతువులు సమావేశమైనాయి. ప్రతి యేడులాగ ఈసారి కూడా సింహాన్ని రాజుగా చేద్దామనుకున్నాయి. జంతువులన్నీ సిద్ధమైనాయి. అంతలో నక్క ముందుకొచ్చి నేను ఈసారి అడవికి రాజుగా ఉంటాను. నన్ను రాజుగా చేయండి అంటుంది. ఒక్కసారిగా జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. సింహం రాజుగా ఉంటే అడవిని రక్షిస్తుంది. నువ్వు ఎలా రక్షిస్తావు. నీకు ఎవరు భయపడతారు అని నక్కను ప్రశ్నించాయి. నాకు కూడా అడవిని రక్షించే శక్తి ఉంది అని నక్క అంది.
సింహం వెనక్కి తగ్గి ఈసారి నక్క అడవికి రాజుగా ఉండని అంది. సింహం మాటకు ఎదురు చెప్పలేక సరేనన్నవి. నక్క చాలా సంతోష పడింది. నేను రాజుగా ఆజ్ఞ చేస్తున్నాను. ఈరోజు నుంచి అడవిలో ఉన్న పండ్లు, దుంపలు అన్ని ఇష్టమైనవి, ఇష్టమైనంతగా తినండి. పండుగ చేసుకోండి అని నక్క అంది. సింహం రాజుగా ఉన్నప్పుడు ఆంక్షలు పెట్టి ఏమి తినకుండా చేసేది. కడుపు మాడ్చుకుని కొద్దిగా తిన్నాము. ఇక కడుపునిండా తినాలని జంతువులన్ని దాచుకున్న ఆహారాన్ని వారం రోజుల్లోనే తిన్నాయి. జంతువులన్నీ ఇప్పుడు పుష్టిగా ఉన్నాయి. ఆహా! నక్క రాజు కావడం వల్ల తమ కడుపు నిండిపోయింది. అంటూ జంతువులు సంతోషించాయి.
ఇక అడవిలో దాచుకున్న ఆహారం మరియు చెట్లకు ఉన్న పండ్లు, దుంపలు అన్ని కొద్ది రోజుల్లో తినడం మూలంగా ఆహారం కొరత ఏర్పడింది. ఏం చేయాలో తెలియక జంతువులు అడవంతా గాలించసాగాయి. కానీ పండు, ఫలము ఏమి దొరకలేదు. పుష్టిగా ఉన్నా జంతువులు కాస్త బక్కపలచ అయ్యాయి. ఆకలి ఆకలి అంటూ రోదించసాగాయి. నక్కను రాజుగా చేసి తప్పు చేశామని, ముందు చూపు గలిగిన సింహం గొప్పతనం తెలుసుకున్నాయి. నక్క జంతువులకు ముఖం చూపించలేక చాటు మాటున తిరుగుతూ ఆకలి తీర్చుకోసాగింది. ఆయేడు ఆకలి ఆకలి అంటూ కష్టపడి, తిరిగి మళ్లీ సింహాన్ని రాజుగా చేసుకున్నాయి. సింహం యొక్క నియమాలకు అనుగుణంగా ప్రవర్తించి, తిరిగి ఆహారం దాచుకుంటూ జంతువులు అడవిలోసంతోషంగా జీవించసాగాయి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి