మాటలను
తూకమేసి వెలకట్టాలి
మనుషులను
తూకమేసి మసలుకోవాలి
వరుడు
వధువును తూకమేసిపెళ్ళిచేసుకుంటాడు
వధువు
వరుని తూకమేసివివాహమాడుతుంది
సరుకులను
కేజీల్లో తూస్తారు
ద్రవమును
లీటర్లలో తూస్తారు
బంగారాన్ని
గురివిందెలతో తూస్తారు
రత్నాలను
కారట్లలో తూస్తారు
న్యాయమూర్తులు
తూకమేసి తీర్పులివ్వాలి
అధికారులు
తూకమేసి చట్టమమలుపరచాలి
లాభనష్టాలు
తూకమేసి బేరీజువేసుకోవాలి
మంచిచెడులు
తూకమేసి నిర్ణయాలుతీసుకోవాలి
జవాబుపత్రాలు
తూకమేసి మార్కులివ్వాలి
ప్రతినిధులను
తూకమేసి ఎన్నుకోవాలి
కర్మలను
దేవుడు తూకమేస్తాడు
పాపపుణ్యాలను
చిత్రగుప్తుడు తూకమేస్తాడు
అమ్మేవాళ్ళు
తక్కువతూకం వెయ్యాలనుకుంటారు
కొనేవాళ్ళు
ఎక్కువతూకం కావాలనుకుంటారు
అక్షరాలు
తూకమేసి వాడాలి
పదములు
తూకమేసి ప్రయోగించాలి
కవితలు
చదివి తూకమేయాలి
కవులను
పోల్చుకొని తూకమెయ్యాలి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి