శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో స్వాతంత్ర్య దినోత్సవ పెరెడ్ గ్రౌండ్ వేడుకల్లో గత వారం జిల్లా స్థాయి ఉత్తమ చిత్రలేఖన ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికై, జిల్లా విద్యాశాఖాధికారి డా.ఎస్.తిరుమల చైతన్య చేతులమీదుగా ఉత్తమ ప్రశంసాపత్రాన్ని స్వీకరించిన యందవ నరేంద్రకుమార్ ను కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు అభినందించారు.
ఈ పాఠశాలలో చిత్రలేఖన ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న యందవ నరేంద్రకుమార్ చేస్తున్న సేవలను కొనియాడుతూ నేడు నిర్వహించిన నరేంద్ర కుమార్ అభినందన సభకు ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందలాది విద్యార్థులను గొప్ప చిత్రకారులుగా తీర్చిదిద్దుటతో పాటు, పాఠశాల తరగతి గదుల గోడలను విజ్ఞానం పంచేలా, విద్యా అభివృద్ధి పథకాలను అవగాహన పరిచేలా వివిధ చిత్రాలతో శాశ్వతంగా ఎంతో సుందరంగా అలంకరించారని కొనియాడారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన చిత్రలేఖన పోటీలలో విజేతలకు ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, సీనియర్ సహోపాధ్యాయులు తూతిక సురేష్, వ్యాయామ ఉపాధ్యాయులు జన్ని చిన్నయ్య, చిత్రలేఖన ఉపాధ్యాయులు యందవ నరేంద్రకుమార్ తదితరుల చేతులమీదుగా బహుమతులను అందజేసారు.
పర్యావరణం అంశంపై బి.జోహన, బి.రేణుక, టి.మనీషాలూ ప్రథమ బహుమతులను, ఎం.ప్రభావతి, ఆర్.నవీన, డి.నీరజలు ద్వితీయ బహుమతులను పొందారు.
పండ్లు పుష్పాల అంశంపై ఎం.యమున, ఎస్.ధాత్రి ప్రథమ స్థానంలో నిలవగా, డి.నాని, బి.భీమశంకర్ లు ద్వితీయ స్థానంలో నిలిచి బహుమతులు పొందారు. జాతీయ జెండా అంశంపై కుప్ప వందన, వి.అక్షయ, వలురౌతు జశ్వంత్ లు, ప్రకృతి అంశంపై చెక్క కీర్తన, ఎం.రేష్మలు ప్రత్యేక బహుమతులను పొందారు.
ఈ చిత్రలేఖన పోటీలకు యందవ నరేంద్రకుమార్, కుదమ తిరుమలరావులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, ఉపాధ్యాయులు తూతిక సురేష్, దార జ్యోతి, పెయ్యల రాజశేఖరం, బండారు గాయత్రి, వల్లూరు లక్ష్మునాయుడు, శివకల శ్రీవాణి, పడాల సునీల్, జన్ని చిన్నయ్య, కుదమ తిరుమలరావు, ముదిల శంకరరావు, బోనెల కిరణ్ కుమార్, గేదెల వెంకట భాస్కరరావు, గుంటు చంద్రం, యందవ నరేంద్రకుమార్, రబికుమార్ మహాపాత్రో, సస్మితా పాఢి, సింగంశెట్టి మురళీకృష్ణలు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి