పండ్ల రూపంలో ఒక పాఠం;- - యామిజాల జగదీశ్
 ఒకే చెట్టు కొమ్మన జామపండునీ జామకాయను చూడొచ్చు. 
ఒకటి ఇప్పటికే బాగా పండింది, మరొకటి పక్వానికి రావటానికి మరింత సమయం అవసరమని వేరేగా చెప్పక్కర్లేదు. దీని ద్వారా ప్రకృతి మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని  నేర్పుతోంది. ఆదేంటంటే...
మనమేదైనా సాధించలేక చుట్టూ ఉన్న ఇతరులు విజయం సాధించినప్పుడు మనం విజయవంతం కాలేకపోయామని బాధపడటం సరి కాదు. మనకింకా సరైన సమయం రాలేదని అర్థం చేసుకోవాలి. అంతేతప్ప కుమిలిపోకూడదు. డీలాపడిపోకూడదు.
మనం పట్టుదలతో ఉండాలి, ఓపికతో ఉండాలి. నిరాశతో అనుకున్నది వదులుకోకూడదు. 
మనం పరిపక్వ స్థితికొచ్చి అనుకున్నది సాధించటానికో లేక చేరుకోవడానికో మరింత సమయం అవసరమని తెలుసుకోవాలి. 
ఒకటి గుర్తుంచుకోవాలి, మనకూ ఒక సమయం వస్తుంది, కానీ దానికి సహనం, పట్టుదల అవసరం.

కామెంట్‌లు