క్రమశిక్షణ;-: సి.హెచ్.ప్రతాప్
 జీవితంలో అతి ముఖ్యమైన కాలం విద్యార్థి జీవితం. మన జీవితానికి పునాది వేసుకునే సమయం ఇది. ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తు ఈ జీవిత కాలంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ జీవిత కాలాన్ని సరైన రీతిలో వినియోగించుకోవాలి.
అలా చేయడానికి, క్రమశిక్షణ అనేది ఒక వ్యక్తి తన జీవితంలో అనుసరించాల్సిన ముఖ్యమైన విషయం. ఒక మంచి విద్యార్థి తన సిలబస్‌ని పూర్తి చేయడానికి లేదా కవర్ చేయడానికి ఎల్లప్పుడూ టైమ్‌టేబుల్‌ను అనుసరిస్తాడు మరియు తద్వారా అతను విజయం సాధిస్తాడు. ప్రకృతి కూడా క్రమశిక్షణను అనుసరిస్తుంది. క్రమశిక్షణ అనేది జీవితంలో అనుసరించకపొతే విజయం అందుకోవడం దుర్లభమని స్వర్గీయ అబ్దుల్ కలాం తరచుగా చెబుతుండేవారు.
ప్రకృతిలో ప్రతీ జీవి క్రమశిక్షణను విధిగా అనుసరిస్తుంది.జీవులే కాక ప్రపంచం క్రమపద్ధతిలో నడిచేందుకు  సూర్యుడు సరైన సమయంలో ఉదయిస్తాడు మరియు అస్తమిస్తాడు, భూమి తన అక్షం మీద క్రమశిక్షణతో కదులుతుంది. అదే విధంగా, ఒక విద్యార్థి తన సర్వతోముఖాభివృద్ధికి క్రమశిక్షణను అనుసరించాలి.
తన చదువు,ఇతర కార్యకలాపాలకు తగినంత సమయం కేటాయించలేరు. టివి, మొబైల్స్, కంప్యూటర్లు, వీడియో గేం స్ లతో పాటు స్నేహితులు కూడా మన దృష్టిని ఆకర్షిస్తూ వుంటారు. ఆ ఆకర్షణలో పడితే ఇక విలువైన సమయం వృధా అవుతుంది. చదువులలో వెనుకబడిపోవడం ఖాయం. కాబట్టి, ఒక విద్యార్థి తన కెరీర్‌లో విజయం సాధించాలంటే మంచి క్రమశిక్షణతో ఉండాలి. ఇక, పరీక్ష హాలులో కూడా క్రమశిక్షణ చాలా అవసరం.
విజయవంతమైన జీవితానికి క్రమశిక్షణ ఒక ముఖ్యమైన ఆస్తి. మరో మాటలో చెప్పాలంటే, విజయవంతమైన జీవితానికి క్రమశిక్షణ కీలకం అని మనం ముగింపులో చెప్పవచ్చు. మనందరికీ విజయవంతమైన జీవితం గురించి కల ఉంటుంది. అందుకోసం సరైన సమయంలో సరైన మార్గంలో పనిచేయాలి.ఆచార్య చాణక్యుడు ప్రకారం క్రమశిక్షణ లేని వారు జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీరు విజయవంతం కావాలంటే..  ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాలాన్ని వృధా చేయకూడదు. సమయం వృధా చేయవద్దు. క్రమశిక్షణ లేకుండా జీవితంలో విజయం సాధించలేరని అన్నారు.సోమరితనంతో చేయాల్సిన పనులను తరచుగా వాయిదా వేస్తారు. అయితే ఇది సరైన పద్ధతి కాదని చాణక్యుడు సూచించాడు. విజయం సాధించాలంటే సోమరితనం విడనాడాలని అన్నారు. సోమరితనం ఉన్నవారికి విజయం ఎప్పటికీ సాధ్యం కాదని చెప్పాడు. ఇంకా ఎవరికైనా సోమరితనాన్ని గొప్ప శత్రువుగా ఎత్తి చూపాడు. 

కామెంట్‌లు