బదిలి పై వెళ్తున్న అధ్యాపకులకు ఘన సన్మానం;-ఆదిలాబాద్ (ఇంద్రవెల్లి)
 మండలంలోని  ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంద్రవెల్లిలలో విధులు నిర్వహిస్తూ  ఇటీవల బదిలి పై ప్రభుత్వ జూనియర్ కళాశాల గుడిహత్నూర్, ఉట్నూర్, హాసన్ పర్తి  కి
వెళ్లిన ప్రిన్సిపల్ ధన్ రాజ్,
లెక్చరర్ రాథోడ్ శ్రావణ్, శ్రీనివాస్, బోధనేతర సిబ్బంది మల్లేసం, శంకర్,సుగుందా బాయి
గార్లకు   కళాశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు.ప్రిన్సిపల్ ధన్ రాజ్  గారి 
 ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
 బదిలి అయిన లెక్చరర్ లకు ఆత్మియ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కళాశాల సీనియర్ అధ్యాపకులు కురపాటి వెంకటేశ్,మధుకర్   మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగికి బదిలీ సహజమని అన్నారు.
 అధ్యాపకులు
 తమ యొక్క విధి నిర్వహణలో  భాగంగా విద్యార్థిని విద్యార్థులను నాణ్యమైన విద్యను భోధిస్తూ
 అంకిత భావంతో విధులు నిర్వహించారని వారి సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు  భోధన, బోధనేతర సిబ్బంది
విధ్యర్థిని, విద్యార్థులు పాల్గోన్నారు.

కామెంట్‌లు