త్రిపుర సుందరి అష్టకం ;- కొప్పరపు తాయారు
 🌲 శ్రీ శంకరాచార్య విరచితం🌲

శ్లోకం:
 పురందర పురంధ్రికా చిక్కుర బంధ సైరంధ్రికాం
 పితామహ పతివ్రతాం పటుపటీర చర్చారతామ్!
 ముకుంద రమణీ లస దలంక్రియా కారిణీం
 భజామి భువనాంబికాం సురవదూటికా కారిణీం !!

భావం: ఇంద్రుని భార్యయగు శశిదేవిచే కేశా లంకరణ చేయబడినదీ, బ్రహ్మదేవుని  భార్య అగు 
సరస్వతిచే మంచి గంధము పూయబడి నదీ, విష్ణు పత్నియగు లక్ష్మీదేవిచే అలంకరింపబడినదీ, దేవతా స్త్రీల చెలికత్తెలుగా కలదీ అగు జగన్మాతను సేవించుచున్నాను.
                  *****


కామెంట్‌లు