న్యాయాలు -590
పర్వతోపత్యకా న్యాయము
****
పర్వత అంటే భూమి మీద రాళ్ళతో నిండిన ఎత్తైన ప్రదేశం,కొండ,గిరి పుడమి తాల్పు, మహీధరం అచలం అద్రి అవనీధరం శైలం అనే పర్యాయ పదాలు ఉన్నాయి.ఉపత్యకా అంటే కొండ యొక్క అడుగు భాగము,పర్వత సమీపమందలి నేల అనే అర్థాలు ఉన్నాయి.
ఉపత్యకా అంటేనే పర్వతము లోపల ఉన్న నేల లేదా అడుగు భాగం అని అర్థము .మరి పర్వతోపత్యకా అని మరోసారి అనాల్సిన అవసరం లేదు కదా! అంటే ఒక విషయాన్ని గానీ , అంశాన్ని గానీ నొక్కి చెప్పేటప్పుడు ఇలా మరోసారి అంటారన్న మాట.
మరి పర్వతం అడుగున,పర్వత పాదాల సమీపంలో ఎలా ఉంటుందో,మన పెద్దవాళ్ళు ఈ న్యాయమును ఎందుకు చెప్పారో తెలుసుకుందామా...
ముందు పర్వతాలు ఏర్పడటానికి కారణాలు తెలుసుకుందాం.పర్వతాలు ఏర్పడటానికిగల ఒక కారణాల్లో ఒకటేమిటంటే రెండు ఖండాంతర పలకలు ఢీకొని పర్వత శ్రేణులు ఏర్పడేంత వరకు నలిగి పోతూ,ముడుచుకుంటూ వుండటం .ఇలా ఏర్పడుతూ ఉంటాయని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. అయితే వాటి అడుగున ఉన్న భూమి లోపల టెక్టోనిక్ ప్లేట్స్ కదలికల వలన, అలాగే భూ అంతర్భాగంలోని అంతర్జనిత శక్తుల వల్ల శిలా ద్రవం భూ అంతర్భాగం నుండి ఉపరితలానికి ప్రవహించినప్పుడు అగ్ని పర్వతాలు ఏర్పడే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు.అలా పర్వతం అడుగున కదలికలు పైకి కనబడక పోయినా,పర్వతం పైన పాదాల సమీపంలో రాళ్ళు రప్పలూ, చెట్టూ పుట్టా కనిపించడం సహజం.
మరి మన పెద్దలు ఈ "పర్వతోపత్యకా న్యాయము" చెప్పడానికి కారణం ఏమై ఉంటుందో ఆలోచిద్దాం.
మనిషి కూడా పైకి కొండలా,పర్వతంలా గంభీరంగా కనిపించినప్పటికీ లోలోపల అంతర్భాగంలో భావోద్వేగ కదలికలు, అంతర్గత బడబానలాలు ఉంటాయని, ఒకోసారి సహనాన్ని కోల్పోయినప్పుడు అగ్నిపర్వతం విస్ఫోటించినట్లుగా ఒక్కసారిగా లోపలున్న ఉద్వేగాలన్నీ బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే ఈ న్యాయమును ఉదాహరణగా చెప్పి వుంటారనేది మనకు తెలిసిపోయింది.
అంటే మనిషిని పైకి ఏ భావాలు కనిపించని ఓ కొండతో పోల్చారన్న మాట.ఈ సందర్భంగా "అంతులేని కథ" సినిమాలో మనసు కవి ఆత్రేయ గారు రాసిన పాటను గుర్తు చేసుకుందాం."కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు/ రాళ్ళలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు/ నాలో ఉన్న మనసు నాకు గాక ఇంకెవరికి తెలుసు/."
దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏమంటే కొండ అడుగున ఉన్న గుండెలో ఏముందో ఎవరికీ తెలియదు. మనుషులూ అంతే.సమయం వచ్చినప్పుడే అంతరాంతరాలలో దాగిన భావోద్వేగాలు బయట పడుతుంటాయి. మరి మనమూ అంతేగా... సమయం వచ్చినప్పుడే మనమేంటో నలుగురికీ తెలిసేది. తెలిపేది. ఇదండీ "పర్వతోపత్యకా న్యాయము"లోని అంతరార్థము. అవకాశం, అవసరం వచ్చేంతవరకూ మనమూ కొండలా నిండుగా గుంభనంగా ఉందాం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి