సుప్రభాత కవిత ; - బృంద
రేయికి తరువాయిగా
వచ్చే వెలుగుల వెల్లువ
వేచిన మది ముంగిట ఆగిన
వెలుతురు పూల పల్లకీ.....

మనసు కన్న కలలు
అసలు తెలియని కనులు
పసిడి కాంతుల ధారలో
తడిసిపోతూ వెదికే ఆనందాలు

మురిపించే వర్ణార్ణవ సొగసులతో
కురిపించే అరుణకాంతులు
కరిగించే తుహిన బిందువుల
మై మరపించే సోయగాలు

లేతఆకులపై జిలుగుల
ప్రేమలేఖ రాసే పసిడివన్నెలు
అవి చదివి పరవశంతో
తలలూపే తరువుల తన్మయాలు..

వేకువెంత సుందరమో!
వెలుగుదెంత సంబరమో!
వెలుతురెంత ధైర్యమో!
వేడుకందుకే  ఉదయం !

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు