సుప్రభాత కవిత ; బృంద
చీకటిలో కనపడని
చిరునవ్వులు వెదికేలా
సిరివెలుగుల వెల్లువలో
చిన్నిపువ్వుల సందడేమో!?

నిరంతరమూ విరబూసే
వసంతంలా కళలూరే
సతత హరిత వన్నెల
సడిలేక అడగిన కోరికలేమో!?

పసిడి రంగుల ప్రకాశంలో
ప్రభవించే పలు మెరుపుల
మెలికలతో నర్తించు పైరులో
కనిపించని కలలు ఫలించెనేమో!?

కనులవిందుగ కరుణించే
కమనీయ దృశ్య దర్శనము
కనురెప్పల మాటున దాగిన
కళకళల రహస్యం వెల్లడించెనేమో!?

ఆకుల చాటున ఆత్మీయంగా
అగుపించి అలరించు
ఆదిత్య కిరణాల కాంతులు
అంతరంగాన్ని అహ్లాదపరచెనేమో!?

గుండెల దాగిన దిగులంతా
కొండ దాపున వేంచేసే
కోటి వెలుగుల పువ్వు
నిండుగ దీవెనలందించునేమో!?

పండుగలా వచ్చి పరవశింపచేసే
వేకువకు

🌸🌸సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు