కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని పెంతల అభిజ్ఞ రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచి, క్రీడా పాఠశాలకు ఎంపికైంది. 2024-25 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్రంలోని క్రీడా పాఠశాలలో ప్రవేశం కోసం నిర్వహించిన వివిధ పోటీల్లో ఆమె మండల, జిల్లా స్థాయిలో అత్యంత ప్రతిభ కనబరిచింది. ఇటీవల రాష్ట్రస్థాయిలో నిర్వహించిన పోటీల్లో 7 అంశాల్లో ప్రథమంగా నిలిచి, ఆదిలాబాద్ జిల్లాలోని క్రీడా పాఠశాలకు కేటాయించబడింది. ఈ సందర్భంగా శనివారం పాఠశాలలో అభినందన సభ ఏర్పాటు చేశారు. పిల్లలకు మిఠాయిలు పంపిణీ చేశారు. చదువుతోపాటు ఆటల్లో రాష్ట్రస్థాయిలో అత్యంత ప్రతిభ కనబరిచి క్రీడా పాఠశాలకు ఎంపిక కాబడిన అభిజ్ఞను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు అమృత సురేష్, కె. శ్రీవాణి, పాఠశాల చైర్మన్ స్వరూప, అమ్మాయి తండ్రి పెంతల రమేష్, మాజీ సర్పంచ్ కొంకటి మల్లారెడ్డి, మాజీ ఎంపిటిసి సతీష్, గ్రామస్తులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, పలువురు అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ... ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేరిన పిల్లలకు రెగ్యులర్ సిలబస్ తో పాటు క్రీడా పాఠశాల, నవోదయ, గురుకుల, ఆదర్శ, సైనిక్ స్కూళ్ల ప్రవేశ పరీక్ష కోసం అదనపు సమయం కేటాయించి, ప్రిపేర్ చేస్తున్నామన్నారు. ప్రతిరోజు అధికంగా రెండు గంటల సమయం కేటాయించి, పిల్లల్ని చదువు, ఆటపాటల్లో, అభిరుచి కలిగిన అంశాల్లో తర్ఫీదునిస్తున్నామనిన్నారు. అభిజ్ఞ క్రీడా పాఠశాలకు ఎంపిక కావడం గర్వంగా ఉందని, గ్రామంలోని పిల్లల తల్లిదండ్రులు వెంటనే తమ పిల్లల్ని ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించాలని ఈర్ల సమ్మయ్య కోరారు.
రాష్ట్ర స్థాయి పోటీల్లో ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని ప్రతిభ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి