భరతమాత పుణ్య చరిత
వికసితభారతంలో మగువలు
అన్నిటా ముందంజ
లేరు ఆమె కి సాటి పోటీ
ఆటపాటలు విద్య వైద్య రక్షణ రంగాల్లో వేస్తోంది ముందడుగు
ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన సుదతి భావికిబంగరు బాటవేసే
చంద్ర యాన్ లో సత్తా చాటే
కైకేయి సత్యభామ కదనరంగాన చూపే కౌశలం
ఝాన్సీరాణి కిత్తూర్ రాణి చెన్నమ్మ రుద్రమదేవి రిపులపని బట్టే
భారత స్వాతంత్ర్య సమరం లో
సరోజినీ నాయుడు దుర్గాబాయి దేశ్ముఖ్ చూపారు తడాఖా
తొలి గిరిజన మహిళ ద్రౌపది ముర్ము దేశాధినేత గా తల్లీ భారతీ నీకు హారతులెత్తేరు
వెయ్యేళ్ళు వర్ధిల్లు తల్లి భారతీ
🌷
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి