భవిత చిత్తు చేయు
మత్తు పొత్తు వదిలి
బ్రతుకు బాగు చేయు
మంచితోనె చెలిమి ,
చేయరండి యువత!
కదిలిరండి జనత!
చేవగలిగియుండు , జీవ పయనమంత ,
చలువ పంచునదియె,
మనసు మమత పెంచ.
తిన్న తినకయుండి
కష్టమెంతొ పొంది
చెమటనంత చింది
బిడ్డ బాగునెంచి
శక్తి ధనము చేసి
రక్తమాంసమునంత
శ్రమగ ధార పోసి
పెంచినట్టి సంతు
మత్తుమందులోన
బానిసలయి తిరిగిన
తల్లిదండ్రి వగచి
బాధనంత మ్రింగి
విషముకన్న విషము
మత్తుమందు చేరి
మహమ్మారి వోలె
మాయచేసెననుచు
గుండెలవిసి పోగ
ఏడ్చి ఏడ్చి ఏడ్చి
జీవచ్ఛవమ్ములయి
తిరుగాడుచుండిరి.
తల్లిదండ్రి పడెడి
బాధనెరిగియుండి
మత్తు వదిలిరండి
బాలలార! మీరు
దేశ కీర్తినంత
నిర్వీర్యము చేయు
మత్తుమందునంత
మసిగ చేయ రండి
యువకులార! మీరు
చైతన్యవంతులై.
మానవత్వమంత
మసకబాయునట్టి
మాదక ద్రవ్యంబు
ధరణి ప్రళయంబు.
ప్రళయమాపగరండి
ఘనులైన జనులార!
వేద భూమి మనది.
చారు శీల అవని.
భరత భూమి కేల?
మత్తు పొడుల పొడలు?
పొడను మాపి,
వెలుగు ఛాయలే
చేరగా,
చేయి చేయి కలిపి,
నినదించ రారండి
నిర్మలమ్ముగ యువత
ఎదిగి నిలవంగా.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి