అక్షర తిలకం;- :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 నిరక్షరతే 
మన దేశపు కళంకం 
అక్షరాస్యతే
దానికి గల దివ్యౌషధం
నిరక్షరతే
మన వృద్ధికి ఆటంకం
సాక్షరతే 
మన ఉన్నతి మూలం
రండి రండి రారండి
రండి రండి రారండి
తరతమ భేదాలు మరిచి 
కలిసిమెలిసి మనమంతా
అక్షర కటి బద్ధులమై 
భరతమాత నుదుటను 
దిద్దుదాం అక్షర తిలకం
భారతీయ జన జాగృతి 
అది జరుగుట తథ్యము!!
**************************************


కామెంట్‌లు