🍀🌟శంకరాచార్య విరచిత🌟🍀శ్లోకం: కదంబవన మధ్యగా కనకమండలోపస్థితాంషడంబు రుహ వాసినీం సతతసిధ్ధ సౌదామినీమ్!విడంబిత జపారుచిం వికచంద్ర చూడామణీంత్రిలోచన కుటుంబీనీం త్రిపుర సుందరీ మాశ్రయే!!భావం: కదంబవన మధ్యము నందున్నదీ, బంగారు మండపమునందు కొలువు తీర్చినదీ.మూలాధారము_స్వాధిష్టానము_మణిపూరము_అనాహతము_విశుద్ధము_ఆజ్ఞలనే ఆరు చక్రము లందు నివసించునదీ, ఎల్లప్పుడూ యోగసిద్ధులకు మెరుపుతీగ వలె దర్శనమిచ్చునదీ, మంకెన పువ్వు వంటి శరీర కాంతి కలదీ, శిరస్సుపై చంద్రుని ఆభరణముగా ధరించినదీ, మూడు కన్నులు కల పరమేశ్వరుని ఇల్లాలు త్రిపుర సుందరిని ఆశ్రయించుచున్నాను.!!*****
త్రిపుర సుందరి అష్టకం ;- కొప్పరపు తాయారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి