చెదిరిపోయిన కలల మూటలు
బెదిరిపోయి ఆగిన మాటలు
నలిగిపోయిన స్నేహపు పుటలు
అడుగంటిన మకరందపు ఊటలు
మసకబారిన చూపులతో
ఆశగ వెదికే అంతరంగాలకు
అందని దూర తీరాల సాగి
చేయిజారిన మమతలు
మది అరలలో అపురూపంగా
దాచుకున్న చెలిమి చేలముల
మధ్యన దాగి మాసిపోక
నాసికను తాకే పరిమళాలు
చిత్రమైన జీవితాన
ఛిద్రమైన కలలెన్నో
నిద్రించిన జ్ఞాపకాలు
ముద్రించిన భావాలెన్నో!
మరిపించే కాలంతో
నడిపించే సమయంతో
కలిసిపోయే పయనమే
సాగిపోయే జీవనం.....
మనసు వాకిట నిలిచిన
మరో ఉదయానికి
🌸🌸 సుప్రభాతం🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి