మనసుకు
ఒకమంచి ఊహతడితే
అది ఓ పండుగ
కలముకు
ఒకమంచి పదముదొరికితే
అది ఓ పండుగ
కాగితముపైన
ఒకమంచి కవితపెట్టగలిగితే
అది ఓ పండుగ
వ్రాసినపుస్తకముకు
ఒకమంచి గుర్తింపువస్తే
అది ఓ పండుగ
పాఠకుడు
ఒకమంచి వ్యాఖ్యనుపంపితే
అది ఓ పండుగ
విమర్శకుడు
ఒకమంచిసమీక్ష వ్రాస్తే
అది ఓ పండుగ
సత్కారమును
ఒకమంచిసాహితీసంస్థ చేస్తే
అది ఓ పండుగ
ప్రభుత్వము
ఒకమంచికవిగాగుర్తించి పురస్కారమందిస్తే
అది ఓ పండుగ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి