వాల్మీకి మహర్షి రాసిన వ్యాసుల వారు రాసినా కాళిదాసు వారు నాటక ప్రక్రియలో ఉపమానాలతో చెప్పినా సమాజంలో నీతిని సంస్కృతిని సంప్రదాయాన్ని నిలబెట్టడం కోసమే అన్న విషయాన్ని మర్చిపోకూడదు రాముడు మంచి బాలుడు అని చెప్పడానికి ఆయనలో ఉన్న మంచి గుణాలను ఎన్నిక చేసి వాల్మీకి మహర్షి సమాజానికి చెప్పాడు అంటే అది సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి శ్రీరామచంద్రమూర్తి కావాలి వారి గుణాలను అనుసరించాలి అని చెప్పడం క్షమా కరుణ శాంత గుణం సహనానికి ప్రతిరూపం కనుకనే ఆయనకు ఎంతో భక్తి శ్రద్ధలతో పండుగల ఉత్సవాలు ఘనంగా జరుపుకునే మనం ఆయనలోని మంచి గుణాలను ఎంతోకొంత అలవర్చుకుంటే మనం చేసే ఆ పండగలకు సార్థకత చేకూరుతుంది మీరు ఆలోచించండి.మన పెద్దలు పిల్లలకు అనేక పర్యాయాలు అనేక సార్లు నీతి బోధలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వారు చెప్పే మాటల్లో మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మాట్లాడడంలో లౌక్యం కావాలి అంటారు లౌక్యం తెలియని వారు ఎవరైనా ఉంటే వారికి ఎదుటివారికి సమాధానం చెప్పే అంశం దొరకనప్పుడు మౌనమే పాటించాలి కొంతమంది తమకు తెలిసిన తెలియకపోయినా ఏదో ఒక సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు అది సరైనదైతే పరవాలేదు లేకపోతే నవ్వుల పాలవుతారు కనుక అలాంటి సమయాలలో చిరునవ్వును ఒక మంత్రంగా ఉపయోగించుకోమని మన పెద్దలు మనకు చెప్పే బోధ దానివల్ల ఎలాంటి కలహాలు రావడానికి అవకాశం ఉండదు అందుకే పెద్దల మాట సద్ది మూట అంటారు.జీవితం ఎవరికైనా సాఫీగా జరిగిపోదు మనం ఆనందం కోసం సుఖం కోసం ఆరాటపడి దానికి కావలసిన వనరుల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేస్తూనే ఉంటాడు అలా చేస్తున్నప్పుడు కొన్ని తప్పులు జరగవచ్చు ఆ తప్పు నాది కాదు ఫలానా వాడి వల్ల జరిగింది అని ఆ తప్పును ఇతరులపై రుద్దకూడదు అలా చేయడం వల్ల అతని మనసు ఎంత బాధ పడుతుందో ఒకసారి ఆలోచించాలి తిరిగి మనకు చెడు చేస్తుంది తప్ప మంచి చేయదు నీవు ఒక అబద్ధం ఆడి ఆ రోజున ఆ తప్పుకు శిక్షను అనుభవించకపోవచ్చు మన పెద్దవారు చెప్తూ ఉంటారు నిలకడ మీద నిజం తెలుస్తుంది అని అలా తెలిసిన రోజున నీ పరువు ఏమవుతుంది ఒక్కసారి ఆలోచిoచు ఎవడు పర్యవసానాన్ని మాత్రం తప్పించుకోలేడు అని జ్ఞాపకం చేసుకుంటే చాలు
============================
సమన్వయం ; డా. . నీలం స్వాతి
============================
సమన్వయం ; డా. . నీలం స్వాతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి