నర్సోబా వాడి అనే దివ్యమైన క్షేత్రంలో తపస్సు చేసేవారు స్వామివారు. అప్పుడు రోజు బిక్షకు వెళ్లేవారు పక్కనుండే గ్రామాలకు.
షిరోలా అనే గ్రామంలో ఒక పేద దంపతులు ఉండేవారు వారికి తినడానికి తిండి కూడా ఉండేది కాదు స్వామి వారు రాగానే వారి దగ్గర ఉండేది స్వామికి పెట్టేవారు.
కొన్ని సంవత్సరాలు వెళ్లారు స్వామిబిక్షకు.
ఒక రోజు వారికి ధాన్యం దొరికేసరికి మనం పండగ చేసుకుందాం అని ఇల్లు శుభ్రం చేసి ధాన్యాన్ని శుభ్రం చేసి అన్నం వండుకున్నారు .
ఆరోజు స్వామివారు బిక్ష అడగడానికి బదులు లోపటికి వెళ్లి మీ ఇంట భోజనం చేస్తాను అన్నారు దానికి వారు సంతోషించి మా ఇంటికి రావడమే గొప్ప రండి అని లోపటికి తీసుకెళ్లి కూర్చోబెట్టి ఆయనకి పూజ చేశారు.
ఇంతలోకి ఆయన భార్య లోపలికి పిలిచి "ఆయనకి భోజనం పెట్టడానికి ఆకు కూడా లేదు ఎంత దౌర్భాగ్యము చూడండి" అని కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది.
" స్వామికి తెలియదా అంటూ నువ్వేం బాధపడకు" అని ఆ బ్రాహ్మణుడు స్వామి దగ్గరికి వెళ్తే.
నరసింహ సరస్వతి స్వామి ఆకు కోసం బాధపడకండి అన్నారు.
అంతే ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయాడు. ఆ బ్రాహ్మడికి స్వామి వారు అక్కడ ఒక రాయి ఉంది ఆ రాయిని శుభ్రం చేసి దాని మీద నాకు ప్రసాదాన్ని పెట్టండి అని చెప్పారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు రాయిని తీసుకెళ్లి భార్యకి ఇచ్చి శుభ్రం చేయి అని చెప్పాడు ఆమె శుభ్రం చేస్తూ ఏడుస్తూ అనుకుంది ఇలాంటి రాతి మీద భోజనం పెడుతున్నామని. కానీ దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి స్వామి వారి దగ్గర పెట్టి అలంకరించిన తర్వాత పూజచేసి .దానిమీద స్వామికి భోజనం పెట్టారు.
భోజనం చేసి స్వామి తృప్తిగా భోంచేశాను త్రుప్తోస్మి అని లేస్తూ ఆ రాతి మీద తన హస్తంతో ముద్ర వేశారు. ఆ ముద్ర నిలిచిపోయింది దానిమీద .ఆ రాతిని పూజించుకోమని చెప్పి వెళ్లారు ఆ రాయిని పూజ చేసేసరికి వారికి దశ తిరిగి ధనవంతులు అయ్యారు ధనవంతులు అయినా కూడా నీతి ధర్మం తప్పకుండా పద్ధతిగా బతికారు.
ఇప్పుడు అరాయి సిరోలా అనే గ్రామంలో భోజన పాత్రా మందిరం అని ఉంది ఆ మందిరంలో మూలవిరాట్. ఈ హస్తం పొద్దుటే అయితే మనం వెళ్లి చూడ వచ్చు.
*****
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి