యుటిఎఫ్ స్వర్ణోత్సవాల్లో భాగంగా రాజాం నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన షటిల్ బ్యాట్మెంటన్ పోటీల్లో రేగిడి ఆమదాలవలస మండలానికి చెందిన టీమ్ లు ప్రధమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (ఎ.పి.యు.టి.ఎఫ్) ఏర్పడి ఏభై సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా రాష్ట్ర కమిటీ నిర్దేశాలమేరకు ఈ పోటీలు నిర్వహించారు. సోమవారం నాడు షటిల్ బ్యాట్మెంటన్ పోటీలను ప్రముఖ వైద్యుడు గార రవి ప్రసాద్ గారు రాజాం జిఎంఆర్ ఐటి ఇండోర్ స్టేడియంలో ప్రారంభించారు. ఈ పోటీల్లో రాజాం నియోజకవర్గంలో గల వంగర, రేగిడి, సంతకవిటి,రాజాం మండలాలకు సంబంధించిన 32 టీమ్ లు పాల్గొన్నట్టు యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి పక్కి వాసు ప్రకటించారు. ఈ పోటీల్లో రేగిడి ఆమదాలవలస మండలానికి చెందిన వై.కిశోర్ వి.సత్యంనాయుడు ప్రథమ స్థానంలో నిలవగా, అదే మండలానికి చెందిన
జి.సింహాచలం, కె.హరిబాబులు ద్వితీయ స్థానంలో నిలిచారని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి మోహనరావు, జిల్లా నాయకులు జి.చంద్రశేఖర్ నాయుడు, ఎ.వి.నాయుడు, రాజాం మండల శాఖ అధ్యక్షులు మువ్వల రమేష్, ప్రధాన కార్యదర్శి బలివాడ నాగేశ్వరరావు, ఎం.శ్రీనివాసరావు,
జి.విష్ణుమూర్తి, డి.రామారావు, పి.కృష్ణారావు,
డి.కృష్ణారావు, ఎస్.అప్పలనాయుడు, బి.శ్రీనివాసరావు, టి.అరుణ్ కుమార్, సి.హెచ్. నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి