సంధ్యలో తొలి పొద్దును
వర్షంలో కురిసిన చివరి చినుకును
మరిగిన నీరు ఆవిరిని
ఘనిభవించిన విత్తనాన్ని
ఎగిరి రాలి పడిన గాలిని
చిగురుకు సరిపోని మోడును
ఎడారి అడవిని
రెక్కలు లేని పక్షిని
అక్షరాల పాత సంతకాన్ని
నక్షత్రాల ఆఖరి వెలుగును
కావ్యం కలుపుగోలుతనాన్ని
వ్యక్తిత్వ నేత్రాన్ని
చూపులు లేని బంధుత్వాన్ని
బంధాలు వీడిన గాలిపటాన్ని
అద్దంలో కనిపించని నీడను
నడి నెత్తిన సూర్యుని గొడుగును
అద్దాలు లేని కంటి చూపును
గదులు లేని ఇంటి గోడను
నాలుగు దిక్కులా దిక్కులేని ఒక మూలను
జీవిత సూత్రాన్ని
నీతి చరిత్రను
రాలిన మాటలను ఎరుకుతినే ఊర పిచ్చుకను.
ఊపిరి ఉరితీతకు నిరీక్షణను
నీటి కుండా గులకరాయి కాకి కథను.
వృద్ధుల దినోత్సవం పురస్కరించునీ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి