ఇటీవల పదవీవిరమణ గావించిన వాండ్రంగి గౌరీ కుమార్ ను పూర్వ విద్యార్ధులు ఆత్మీయ సత్కారం గావించారు. ఆరు సంవత్సరాలుగా బొద్దాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తూ గతనెలలో పదవీవిరమణ గావించిన గౌరీ కుమార్ ను, రెండు దశాబ్దాల క్రితం నాటి తన శిష్య బృందం కృతజ్ఞతా పూర్వకంగా ఆత్మీయతతో సన్మానించారు.
నేడు ఉద్యోగ, ఉపాధి రీత్యా వేర్వేరు ప్రాంతాలలో స్థిరపడిన
ఆ పూర్వ విద్యార్థులు తమకు విద్యాబుద్ధులనందించిన గురువుగారి పదవీవిరమణ చేసారని తెలిసి, వారిని గుర్తుంచుకొని నేరుగా రాజాంలోని గౌరీ కుమార్ స్వగృహానికి వెళ్లి గౌరవ సన్మానాన్ని చేసి తమ గురుభక్తిని చాటుకున్నారు. 2002-03 బ్యాచ్ కి చెందిన విద్యార్థులు టి.గోవిందరావు, కాకర్ల సత్యనారాయణ, అరసవిల్లి గణపతి, మొయిల నాగమణి, బండి శ్రీనివాసరావు, కాకర్ల లీలావతి తదితరులు శాలువా, పుష్పగుచ్చం, జ్ఞాపిక, కానుకలు, పూలమొక్కలతో గౌరీ కుమార్ దంపతులను ఘనంగా సన్మానించారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి