కొత్తగా...కొత్తకొత్తగా.....;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కొత్తగా
చూడాలనుకుంటున్నా
కొత్తవిషయాలను
తెలుసుకోవాలనుకుంటున్నా

కొత్తగా
మాట్లాడాలనుకుంటున్నా
కొత్తపదాలను
ప్రయోగించాలనుకుంటున్నా

కొత్తగా
తయారవాలనుకుంటున్నా
కొత్త అందాలతో
ఆకర్షించాలనుకుంటున్నా

కొత్తగా
ఆలోచించాలనుకుంటున్నా
కొత్తఙ్ఞానమును
సంపాదించాలనుకుంటున్నా

కొత్తగా
రెక్కలుతొడుక్కోవాలనుకుంటున్నా
కొత్తలోకంలో
విహరించాలనుకుంటున్నా

కొత్తగా
మారాలనుకుంటున్నా
కొత్తదనాలను
పరిచయంచేయాలనుకుంటున్నా

కొత్తగా
వ్రాయాలనుకుంటున్నా
కొత్తకవితలను
కూర్చాలనుకుంటున్నా

కొత్తగా
వేషముమార్చాలనుకుంటున్నా
కొత్తపాత్రను
పోషించాలనుకుంటున్నా

కొత్తకవిగా
ఖ్యాతిపొందాలనుకుంటున్నా
కొత్తనాలుకలపై
నానాలనుకుంటున్నా

పాతను
తరిమెయ్యాలనుకుంటున్నా
కొత్తను
ఆహ్వానించాలనుకుంటున్నా


కామెంట్‌లు