కడుములో తెలుగు భాషా, జాతీయ క్రీడా దినోత్సవాల వేడుకలు

 వ్యవహారిక భాషకు పట్టం కట్టిన గిడుగు రామమూర్తి పంతులు, క్రీడారంగానికి వన్నె తెచ్చిన ధ్యాన్ చంద్ లు ఆదర్శప్రాయులని కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు అన్నారు. 
వీరిద్దరి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జరిగిన కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈకార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు వల్లూరు లక్ష్మునాయుడు, ముదిల శంకరరావులు ప్రత్యేక ప్రసంగాలు చేసి గిడుగు వారి సేవలను వివరించారు. వ్యాయామ ఉపాధ్యాయులు జన్ని చిన్నయ్య ధ్యాన్ చంద్ నిరంతర కృషిని గూర్చి ప్రసంగించారు. ఈ సందర్భాలను పురస్కరించుకొని విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేసారు.  ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, ఉపాధ్యాయులు తూతిక సురేష్, దార జ్యోతి, పెయ్యల రాజశేఖరం, బండారు గాయత్రి, వల్లూరు లక్ష్మునాయుడు, శివకల శ్రీవాణి, బత్తుల వినీల, పడాల సునీల్, జన్ని చిన్నయ్య, ముదిల శంకరరావు, గుంటు చంద్రం, రబికుమార్ మహాపాత్రో, సస్మితా పాఢి, సింగంశెట్టి మురళీకృష్ణలు పాల్గొన్నారు. అనంతరం మిఠాయి పంపకం జరిగింది.
కామెంట్‌లు