కల!!!;- డా.ప్రతాప్ కౌటిళ్యా
పుడితే పులిలా పుట్టాలనుకున్నాను
పిల్లిలా పుట్టాను. 

పుడితే హంసలా పుట్టాలనుకున్నాను
కోడిపుంజులా పుట్టాను. 

పుడితే మామిడి పండులా పుట్టాలనుకున్నా 
మేడిపండులా పుట్టాను. 

పుడితే గంధపు చెట్టులా పుట్టాలనుకున్నాను. 
గంజాయి చెట్టులా పుట్టాను.

పుడితే స్త్రీల పుట్టాలనుకున్నాను 
పురుషుడిలా పుట్టాను. 

పుడితే వజ్రంలా పుట్టాలనుకున్నాను 
కాలిన బొగ్గుల పుట్టాను. 

పుడితే రత్నంలా పుట్టాలనుకున్నాను 
రాయిలా పుట్టాను. 

పుడితే తేనెలా పుట్టాలనుకున్నాను. 
తేనీరుల పుట్టాను.

పుడితే బంగారంలా పుట్టాలనుకున్నాను 
తగరంలా పుట్టాను. 

పుడితే కాళిదాసులా పుట్టాలనుకున్నాను
దేవదాసులా పుట్టాను. 

పుడితే అబ్దుల్ కలాం లా పుట్టాలనుకున్నాను 
చివరికి ఒక కలలా పుట్టాను.

నేను ఒక కల ను!!!?

డా.ప్రతాప్ కౌటిళ్యా.

కామెంట్‌లు