పాపాయి - జయా
ఎవరి బొమ్మ అని
అడిగితే
పాప బొమ్మ 
అంటుంది పాపాయ్

ఎవరక్కడ
ఉంచారు అని
అడిగితే
పాప అని అంటుంది
పాపాయ్

ఎవరు నువ్వు అని
అడిగితే
పాప అని అంటుంది
పాపాయ్

పాపాయ్
ఇక్కడికి రా అని
అంటే
దగ్గరకొచ్చి 
పాపొచ్చేసింది అని
చెప్తుంది పాపాయ్

నేనూ
నాకూ
నాదీ 
నావీ వంటి మాటలు
తెలియనంత వరకూ
పాపాయ్ పాపాయిగానే
ఉండనీ పాపాయ్


కామెంట్‌లు