ప్రభుత్వ పాఠశాలల్లో మెరికల్లాంటి పిల్లలని తయారు చేస్తున్నాం;- -ఎంఈఓ సురేందర్ కుమార్

  కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ఇంగ్లీష్ pమీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని పెంతల అభిజ్ఞ రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచి, ఆదిలాబాద్ క్రీడా పాఠశాలకు ఎంపికైన విషయం విదితమే. పెద్దపల్లి జిల్లా నుంచి అభిజ్ఞ మాత్రమే సెలెక్ట్ కావడంతో ఆమెను ఉపాధ్యాయులు, అధికారులు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, పలువురు అభినందించారు. బుధవారం కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎమ్మార్సీ భవనంలో మండల విద్యాధికారి టి. సురేందర్ కుమార్, ఎఫ్ఎల్ఎన్ మండల నోడల్ అధికారి సిరిమల్ల మహేష్, ఇతర 
 ఉపాధ్యాయ బృందం పెంతల అభిజ్ఞకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఆమెకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. అభిజ్ఞ బాగా చదువుతూ ఆటల్లో అగ్రస్థానంలో నిలవాలని వారు కోరారు. తర్వాత ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి విశేషంగా కృషి చేస్తున్న అభిజ్ఞ తండ్రి  రమేష్ ను కూడా శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఎంఈఓ సురేందర్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువు, ఆటల్లో ప్రత్యేక శిక్షణనిచ్చి మెరికల్లాంటి పిల్లల్ని తయారు చేస్తున్నామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ఎంఈఓ కోరారు.  ఈ కార్యక్రమంలో ఎంఎన్ఓ మహేష్, ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయుడు అమృత సురేష్ కుమార్, అమ్మాయి తండ్రి పెంతల రమేష్, ముంజాల హరికృష్ణ, పులి శ్రీనివాస రెడ్డి, సిఆర్పిలు కుంట కుమారస్వామి, చంద్రకళ, ఎమ్మార్సీ సిబ్బంది జాలిగం రమేష్, సుంకరి రమేష్,, ఉపాధ్యాయులు పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు