వైవిధ్యం;- సాయి వేమన్ దొంతి రెడ్డి,-కుంచన పల్లి.
 నిత్యం మీ కుటుంబ సభ్యులకు స్నేహితులతో చిన్న పిల్లలతో కాలం   గడిపితే  మానసికంగా నీకు ఎంతో తృప్తి కలుగుతుంది  దీనితోపాటు  ప్రతిరోజు కూడా కనీసం ఒక పది నిమిషాలు అయినా  నీలోనే మాట్లాడుకో  ఎవరితోనో పోల్చుకుంటూ అలా మనకు లేదే  అనే అసంతృప్తితో జీవితాన్ని గడపవద్దు నీకు ఎంత ఆదాయం వస్తే దానితోనే ప్రశాంతంగా హాయిగా జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయాలి తప్ప లేని దాని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవడం మంచిది కాదు ఆరోగ్యానికి  సాధ్యమైనంత వరకు పొదుపుని పాటించి అది భవిష్యత్ జీవితంలో ఉపయోగపడుతుంది  సాధ్యమైనంతవరకు నడవడం  యోగ కనీసం 10-15 నిమిషాలు  చేయటం మాలకు ఏకాంతంగా నీకు నచ్చిన  నామాన్ని స్మరిస్తూ  శాంతిని పొందటం చాలా మంచిది.అటువంటి హితం కోరిన వారిని శరీరంలో జయించిన వ్యాధి లేక రూపం వంటి వారు ఆ రోగాన్ని ప్రక్షాళన చేసి తీరాలి. వీలున్నట్లయితే శరీరాన్ని రోగగ్రస్తం కాకుండా జాగ్రత్త పరుచుకోవాలి వ్యాధిని దరిదాపులకు రాకుండా జాగ్రత్త పడాలి  హితులైన వారు రోగగ్రస్త శరీరాన్ని రోగము నుంచి విముక్తిని చేయగలిగే ఎక్కడో దూరంగా ఉండే అరణ్యంలోని ఔషధము లాంటివారు  అట్టి ఔషధాన్ని జాగ్రత్తగా కాపాడుకొని  ఎప్పుడు దానిని మనం దగ్గర ఉంచుకోవాలి  అలాగే ఔషధం లాగా గాని హితులు స్నేహితులు అత్యంత విలువైన వారు అని తెలుసుకొని నిజమైన  బందు వర్గం  అనుగ్రహించి వారిని మన పక్కన ఎప్పుడూ ఉంచుకోవడానికి ప్రయత్నించండి.కష్టేఫలి అని పెద్దలు చెప్తారు  ఏదైనా కష్టపడితే దానికి తగిన ఫలితం తప్పకుండా ఉంటుంది అంటారు ఉదాహరణకు సీతాకోకచిలుకను తీసుకున్నట్లయితే దాని జీవితం ఏమిటి పుట్టుకతోనే సీతాకోకచిలుక మారిందా  ఎన్ని అవతారాలు ఎత్తితే ఆ సీతాకోకచిలుకగా అందంగా సరళంగా చూడగానే ముచ్చటగా కనిపించేలా ఉండి  నదీ ప్రవాహాన్ని ఒక్కసారి మనం  గమనించినట్లయితే  ఎన్ని వంకలు తిరుగుతూ తన ప్రవాహాన్ని ముందుకు తీసుకు వెళుతూ  ఆ ప్రవాహానికి పరవళ్ళు సులువుగా అవుతాయా  మెరుపులు చూసినట్లయితే ఆ ప్రకాశ కాంతి చవకగా పోగవలేదు కదా అలాగే మనిషికి కీర్తి ప్రతిష్టలు కూడా  ఒక్కసారిగా రావు తన ప్రవర్తన మాట తీరు సమాజంలో ఇతరుల పట్ల వాడు  ప్రవర్తించే పద్ధతిని  అనుసరించి వస్తాయి  తన వ్యక్తిత్వం పెరుగుతుంది దానివల్ల.
=====================================
=సమన్వయం ;- డా . నీలం స్వాతి 

కామెంట్‌లు