తిరుమలరావుకు జనజాగృతి సత్కారం.

 కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావుకు మరో అరుదైన గౌరవం లభించింది. పలాస కాశీబుగ్గ జనజాగృతి ఆధ్వర్యంలో కాశీబుగ్గ జనజాగృతి కార్యాలయంలో నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవం కార్యక్రమంలో తిరుమలరావును సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తిరుమలరావు తన కవితలు, పాటలతో అందరి ప్రశంసలు పొందారు. 
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గిడుగు రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ  వేదికపై తెలుగుకు పట్టిన గొడుగు వెలుగులు పంచిన గిడుగు అనే కవితను తిరుమలరావు వినిపించారు. అనంతరం జనజాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ డా.తెప్పల కృష్ణమూర్తి, అధ్యక్షులు డా.కుమార్ నాయక్, ప్రముఖ సాహితీవేత్తలు కుత్తుమ వినోద్, కె.రోజారాణి తదితరుల చేతులమీదుగా తిరుమలరావును శాలువా, జ్ఞాపిక, బోన్సాయ్ మొక్కలతో ఘనంగా సన్మానించారు. 
గిడుగు రామమూర్తి జీవిత విశేషాలను, వ్యవహారిక భాషోద్యమకారునిగా పోరాడే అంశాలను, సాధించిన ఫలితాలను తిరుమలరావు తన కవిత ద్వారా వినిపించి, గిడుగు త్యాగనిరతిని చాటిచెప్పారు. తొలుత జనజాగృతి ప్రతినిధులు జ్యోతి ప్రజ్వలన, గిడుగు రామమూర్తి చిత్రపటానికి పూలమాలాలంకరణ గావించి నివాళులు అర్పించారు.
తిరుమలరావుకు గిడుగు రామమూర్తి కవి సమ్మేళన సత్కారం పొందుట పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
కామెంట్‌లు