వైవిధ్యం;- సాయి వేమన్ దొంతి రెడ్డి,-కుంచన పల్లి.
 నాడు వ్యవసాయం  సంవత్సరానికి ఒక పంట ఈ రోజున సాంకేతిక పరిజ్ఞానం పెరిగి  రెండు మూడు పంటలు పండించే పరిస్థితి వచ్చింది  ఎన్నిసార్లు ఆ నేలను దున్నినా ఆ నేల అరిగిపోదు నీరు ఎక్కడ నుంచి ఎక్కడి వరకు  ఉరకలేస్తూ  పరిగెడుతుందో మనకు తెలుసు  అయినా అది అలసిపోదు  ఏ చెట్టును గమనించినా  ఎన్ని ఫలాలను మనకు అందిస్తూ ఉంటుంది  ఏ రోజు ఆపదు కదా  ఎప్పుడు గర్వపడి ఎరగదు ఎంతమంది ఆకలిని తీరుస్తున్నామని చెప్పుకోదు  కానీ ఎప్పుడు ఎలా మరణిస్తామో తెలియని మనం మాత్రం  కాస్తంత సంపాదించి తమంతవారు లేరు అని ఎగిరెగిరి పడతాం  ఎదుటివారిని చాలా చిన్నచూపు చూస్తాo  ప్రకృతికి మనకు ఉన్న భేదం అదే  ఎంత ఉన్నా అణిగి మణిగి ఉండడం నేర్చుకుంటే  మరియాద నిలుపుకున్న వాడవుతాడు.ఏ వ్యక్తిలోనైనా రెండు రకాల మనస్తత్వాలు ఉంటాయి  తాను చేసేది సరైనది అని  ఇతరులు ఏది చేసినా అది తప్పు అని  భ్రమలో ఉండడం  ప్రతి మనిషిలో సానుకూల పద్ధతి  ఉండాలి  ఎదుటివారు ఏదైనా మాట్లాడినప్పుడు దానిని  తన పద్ధతిలోనే కాకుండా అతను ఏ అర్థంలో దానిని మాట్లాడాడు  అది అర్థం చేసుకున్నట్లయితే  అతను మాట్లాడిన దాంట్లో నిజం ఏమిటో మనకు తెలుస్తుంది  ప్రతి మనిషిలోనూ ఒత్తిడి ఉంటుంది ఆనందంగా ఉంటుంది  ఒత్తిడి ఉన్నప్పుడు ప్రతికూలంగా ఆలోచించడం  ఎదుటివారిపై  యుద్ధానికి సిద్ధమవడం  దానిని ఒక్కసారి రెండవ  కోణంలో కూడా ఆలోచించి  అలా చెప్పవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది  అని ఒక్కసారి తగ్గించుకున్నట్లయితే  ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని మానసిక శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉంటాడు.ప్రతి మనిషికి ఆకలి కావడం  దాహం తీర్చుకోవడం  సహజం  దాహం తీర్చుకోవడానికి మంచి నీరు కావాలి  దానిని తాగడానికి  కొన్ని పద్ధతులు ఉన్నాయి  ఎప్పుడు నిలబడి నీరు తాగకూడదు కూర్చుని మాత్రమే నీరు తాగాలి  అలా నిలబడి నీరు తాగితే గుండెల్లో మంట ఏర్పడే అవకాశం ఏర్పడుతుంది  జీర్ణాశయంలో అల్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీటన్నిటిని మించి మోకాళ్ళలో నీరు చేరే ప్రమాదం ఉంటుంది  అలా జరిగితే అక్కడ ఉండే గుజ్జు కరిగి మోకాళ్ళ నొప్పులు వస్తాయి  దీంతో ఎముకలు కూడా బలహీనంగా మారడానికి  అవకాశం ఉంది కనుక మంచినీళ్లు తాగేటప్పుడు కూర్చుని తాగడం మంచిది  ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది.
==========================
సమన్వయం ; డా. నీలం స్వాతి

 
కామెంట్‌లు