🪷శివానందలహరి;- కొప్పరపు తాయారు

శ్లో :
ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమ బంధుః పశుపతే
ప్రముఖ్యో హం తేషా మపి  క్రిముత బంధుత్వమనయోః
త్వయై వక్షంతవ్యాః శివ మదపరాశ్చ సకలాః
ప్రయత్నాత్కర్తవ్యం మధవన మియం బంధుసరణీః !

  భావం : పశుపతి అయిన ఓ శివా ! నీవు దీనులకు దగ్గర చుట్టమువు కదా ! నేను దీనులలో అగ్రేసుడై ఉన్నాను. మన ఇద్దరికీ ఇంత దగ్గర చుట్టరికం కలదు కదా! కావున ఓ ప్రభూ! నా నేరములు అన్నింటినీ క్షమించి నన్ను నీవే కరుణించి రక్షించ వలయును కదా! ఇది బంధువుల పద్ధతి! 
                  *****

కామెంట్‌లు