దేశభక్తితోనే స్వాతంత్ర్యం-సమరయోధులే మనకు ఆదర్శం

 మెండైన దేశభక్తితోనే స్వాతంత్ర్యం సిద్ధించిందని, స్వాతంత్ర్యం సాధించి మనకు స్వేచ్ఛనందించిన నాటి సమరయోధులంతా మనకు ఆదర్శప్రాయులని కిడిగాం పంచాయతీ సర్పంచ్ రౌతు రజని అన్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై, జాతీయ పతాకాన్ని ఎగురవేసారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రధానోపాధ్యాయులు సర్ల రామారావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువుతో పాటు సంస్కారం కూడా పెంపొందించుకోవాలని, దేశాభివృద్ధికై చిత్తశుద్ధితో కూడిన సేవలందించాలని అన్నారు. 
దేశభక్తుల చిత్రపటాలకు సి.ఆర్.సి.సి. ఆర్.మధుకుమార్ చే పూలమాలాలంకరణ జరిగింది. 
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన ఆటల, పాటల, క్విజ్, దస్తూరీ, వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు 
గ్రామ సర్పంచ్ రౌతు రజని, సమితి మెంబర్ బర్ల శ్రీధర్, ఉపసర్పంచ్ తిరుపతిరావు, విద్యాలయ కమిటీ ఛైర్మన్ కె.మహేశ్వరరావు, వైస్ ఛైర్ పర్సన్ పార్వతమ్మ తదితర గ్రామపెద్దల చేతులమీదుగా బహుమతులు అందజేసారు. 
అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కడుము ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు మువ్వన్నెల పతాక గీతాన్ని,  గ్రామపౌరులు పనస మిన్నారావు దేశభక్తి గీతాన్ని ఆలపించి అందరి ప్రశంసలు పొందారు.
ఈ కార్యక్రమంలో వేదికనలంకరించిన పెద్దలంతా భారత స్వాతంత్ర్య సాధనకై  సమరయోధులు చేసిన త్యాగాలను, చేసిన కృషిని వివరిస్తూ ప్రసంగించారు.
సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తొలుత విద్యార్థుల ర్యాలీతో గ్రామమంతా దేశభక్తి నినాదాలతో మార్మోగింది. ఈనాటి కార్యక్రమంలో 
ప్రధానోపాధ్యాయులు సర్ల రామారావు, 
ఉపాధ్యాయులు మావిడి సంధ్యారాణి, కలమట బాలకృష్ణ, మండా శ్రీకళ, జగన్నాథ నాయక్, నాగవంశ కృష్ణవేణి, పడాల రజని, ఎం.లత, ఎం.నిర్మల, గణేశ్వర్ పండా, రూపా జన్నా, వార్డు మెంబర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆరోగ్య శాఖ ప్రతినిధులు, ఆశ కార్యకర్తలు, అలూ మినీ కమిటీ పూర్వ విద్యార్ధుల సంఘ సభ్యులు,  విద్యాలయ కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు, గ్రామపెద్దలు తదితరులు పాల్గొన్నారు. 
అనంతరం మిఠాయి పంపకం జరిగింది.
కామెంట్‌లు