బుద్ధుని మహా పరి నిర్వాణం ;- చిరసాని శైలూషి,నెల్లూరు.

 బుద్ధుడు లేచిన తర్వాత ఆనందా బంగారు పనిచేసే కంసాలి కొడుకైన చుoదున్ని ఎవరైనా ఈ రకంగా నిందించే అవకాశం ఉంది చుoదా నీవు పెట్టిన చివరి భోజనం తిన్న తరువాత బుద్ధుడు పరినిర్వాణం చెందాడు అలాంటి ఏదైనా ఆరోపణలు కానీ ఈ రకంగా ఎదుర్కోవాలి చుoదా నీవు పెట్టిన చివరి భోజనాన్ని తన తర్వాత తథాగతులు పరినిర్వాణం చెందాడు ఇది నీకు అత్యంత లాభదాయకం ఎందుకంటే  తథాగతుని నోటి వెంట వచ్చిన మాటల్ని నేను విన్నాను కాబట్టి మిత్రమా చుoదా రెండు సందర్భాల్లో బుద్ధునికి పెట్టిన భోజనం అసమాన ఫలాన్నిస్తుంది ఏమిటా రెండు సందర్భాలు అంటే అవి గౌతములు ప్రజ్ఞతో సంబోధిని పొంది పరిపూర్ణ జ్ఞాని అయినప్పుడు తిన్న భోజనం ఒకటి కాక ఏ భోజనం చేసిన తర్వాత తథాగతుడుయ కృష్ణ త్రయ నాశనాన్ని  గావించుకొని మళ్లీ పుట్టుకంటూ లేని పరినిర్వాణం ని పొందాడో అది రెండవ సందర్భం.ఇందుకోసం చుoదుడు ఎన్నాళ్ళ నుంచో దీర్ఘాయువు మంచి స్థితి సుఖం కీర్తి స్వర్గాలను సంతరించి పెట్టే ఆ మంచి పని చేసే భాగ్యాన్ని సొంతం చేసుకుని దాచుకున్నాడు చుoదుని పై వచ్చే ఏ ఆరోపణలైన నిందలైన ఇలా ఎదుర్కోవచ్చు ఆనందా అని ఇక మనం హిరణ్నావతి నది ఒడ్డునే కుశినారా వైపు గల మల్లుల సాలవనానికి చేరుకోవడానికి ఇంకా ముందుకు పోదాం అని అన్నాడు బుద్ధుడు అలాగే భగవాన్ అన్నాడు ఆనందుడు అప్పుడు భిక్షు సంఘం వెంటరాగా మల్లుల సాలవనానికి బయలుదేరాడు బుద్ధుడు ఆనందా నేను అలిసిపోయాను రెండు సాల వృక్షం ల మధ్య చాలా మధ్య నాకు ఒక పక్క  ఏర్పాటుచెయ్యి నేను దాని మీద పడుకోవాలి అన్నాడు బుద్ధుడు.అలాగే భగవాన్ అని బుద్ధుని కోరిక మేరకు రెండు సాల వృక్షంల మధ్య పక్కనేర్పాటు చేశాడు ఆనందుడు అప్పుడు బుద్ధుడు నిద్రిస్తున్న సింహం భంగిమ లో పడుకున్నాడు అది పూలు పూసే రుతువు కాదు అయినప్పటికీ ఆ జంట సాల వృక్షంల పూలతో నిండి కనిపిస్తున్నాయి బుద్ధునిపై వెదజల్లి పరిమళాన్ని కురిపిస్తూ కప్పేస్తున్నాయి అదే సమయంలో ఆకాశం నుంచి స్వర్గ మందారాలు గంధపు పొడి తధాగతుని శరీరంపై ధారగా కురుస్తున్నాయి వీటికి తోడు స్వర్గoలోకపు సంగీతం పాటలు వినిపిస్తున్నాయి రెండు సార్లు పూలతో నిండిపోయాయి  ఆ పూలన్నీ తథాకథను శరీరం పై పడి కప్పేసాయి అలాగే అవకాశాన్నించి స్వర్గ మందారాలు గంధం పొడి తధాగతను శరీరంపై కురిశాయి త్వరగా ప్రసంగితం పాటలు వినిపించాయి.
==============================================
సమన్వయం ; డా. నీలం స్వాతి
కామెంట్‌లు