నేను
నక్సలైట్ ను -ఆయుధం ధరించను.!
నేను
సైనికున్నీ-యుద్ధం చేయను.!!
నేను
ఉపాధ్యాయున్నీ-కానీ బోధించను!!
నేను
రచయితను-కానీ రాయను.
ఆకాశంలో ఎగురుతున్న పక్షుల
ప్రపంచం సృష్టిస్తుంటాను.!
నీటిలో ఈదే చేప పిల్లల లోకం
ప్రతిష్టిస్తుంటాను.!!
మైదానాల్లో విత్తులు చెల్లి
పచ్చని పంటలను పండిస్తుంటాను.!!!
మేఘాల్ని కరిగించి భూమిపై పారే
నదుల్ని పుట్టిస్తుంటాను.!!!
గాలిలా కనిపించకుండా బ్రతికేస్తుంటాను.
అందర్నీ బ్రతికిస్తుంటాను.!!!?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి